భారత క్రికెటర్‌గా ఇదే నా చివరి రోజు.. రవిచంద్రన్ అశ్విన్
ASWIN: భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అశ్విన్.. అన్ని ఫార్మాట్ల నుండి వీడ్కోలు చెబుతున్నా అన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇదే నా చివరి రోజు .. ఎన్నో అనుభవాలను అందించిన సహచర క్రికెటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు.
అస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రాగా ముగిసింది. అనంతరం అశ్విన్ మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశాడు. క్రికెటర్‌గా నాలో ఇంకాస్త ఆట ఉందని.. తప్పకుండా క్లబ్ క్రికెట్లో ఆడతా నన్నారు. భారత క్రికెటర్‌గా ఇదే నా చివరి రోజన్నారు. ఈ సందర్బంగా ఎంతో మందిని గుర్తుచేయాలని.. రోహిత్, విరాట్, అజింక్య ,పుజారా ఈ జాబితాలో తప్పక ఉంటారన్నారు. ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నా.. ఇపుడే నేను మొదటిసారి అస్ట్రేలియాలో పర్యటించినట్లు అనిపిస్తోందన్నారు. ప్రతి ఒక్కరికీ వీడ్కోలు పలికే సమయం వస్తుందని, ఇపుడు తనకు వచ్చిందన్నారు. నేను అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఉండవచ్చు, కానీ.. ఆటపై అభిమనాం ఎప్పటికీ తగ్గదని తెలిపారు. మెల్‌బోర్న్‌లో ఎలా ఆడుతున్నారో టీవీలో చూస్తానని..ఇండియన్ టీమ్‌కు ఆల్‌దిబెస్ట్ చెప్పారు. మీకు అవసరమైతే తాను కేవలం ఫోన్ కాల్ దూరంలో ఉంటానని అశ్విన్ తెలిపారు.