రోహిత్ శర్మ నిస్వార్థ ఆటగాడు.. రవిచంద్రన్ అశ్విన్

Aswin: భారత కెప్టెన్ రోహిత్ శర్మపై మాజి క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ శర్మ విషయంలో నాకొక విషయం బాగా నచ్చుతుందని.. ఇప్పుఉన్న క్రికెటర్లలో అతడొక నిస్వార్థమైన క్రికెటర్‌గా అభివర్ణించాడు. ఒక వేళ తనే స్వార్థపరుడైతే వన్డేల్లోనూ దూకుడుగా ఆడి.. పవర్ ప్లేలో భారీగా పరుగులు రాబట్టాలనే ఉద్దేశంతో ఉండేవాడన్నారు. అందుకే. అతడిపట్ల తనకు అపారమైన గౌరవమని రవి చంద్రన్ తెలిపాడు.
జట్టులో ఎవరైనా సెంచరీ సాధిస్తే అది అతడి గొప్పతనమేమీ కాదని.. క్రీడాకారులు రోజువారీ జీవితంలో భాగమేనని గుర్తుంచుకోవాలని అశ్విన్ అన్నారు. జట్టులో ఎవరూ స్టార్ కల్చర్‌ని ప్రోత్సహించకూడదని.. సాధారణ ప్రజల మాదిరిగానే జీవన విధానం కొనసాగించాలని కోరాడు. భారత క్రికెట్‌లో పెరిగిపోతున్న సూపర్‌స్టార్ సంస్కృతిని అతను తప్పుబట్టారు. క్రికెటర్లు నటులూ..సూపర్‌స్టార్లు కాదని.. కేవలం క్రీడాకారులు మాత్రమేనన్నారు. అంతేకాక.. ఛాంపియన్స్ ట్రోపీ జట్టు ఎంపిక విషయంలో తనకు అసంతృప్తి ఉందని అశ్విన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.