తెలంగాణ నూతన డిజిపిగా రవిగుప్తా నియామకం..

హైదరాబాద్ (CLiC2NEWS): నూతన డిజపిగా రవిగుప్తా నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం డిజిపి అంజనీకుమార్ ని సస్సెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో రవిగుప్తాని నూతన డిజిపిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
తెలంగాణ డిజిపి అంజనీకుమార్ ని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని.. ఆయన్ని సస్సెండ్ చేసినట్లు సమాచారం. మరో ఇద్దరు అదనపు డిజిలు సందీప్ కుమార్ జైన్, మహేశ్ భగవత్ కు నోటీసులు జారీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా రేవంత్ రెడ్డిని కలవడంపై ఇసి ఆగ్రహం వ్యక్తం చేసింది. రేవంత్‌ని కలవడంపై విచారణ ఇవ్వాలని ఐసి ఆదేశాలు జారీ చేసింది.