చివ‌రి ప్లేఆప్స్ బెర్త్ ఎవ‌రిదో..!

IPL: బెంగ‌ళూరు , చెన్నై మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచ్‌లో బెంగ‌ళూరు ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆర్‌సిబి 5 వికెట్ల న‌ష్టానికి 218 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్లు కోహ్లీ 47 ప‌రుగులు, డుప్లెసిస్ 54, ర‌జ‌త్ ప‌టిదార్ 41 కామెరూన్ 38* ప‌రుగులు చేశారు. చెన్నై బౌల‌ర్లు శార్దూల్ ఠాకూర్ 2, తుఆర్ దేశ్‌పాండే, మిచెల్ శాంట‌ర్న్ ఒక్కో వికెట్ ప‌డ‌గొట్టారు. 219 ప‌రుగుల ల‌క్ష్యంతో చెన్నై బ‌రిలోకి దిగింది.

చెన్నై జ‌ట్టు ఏడు మ్యాచుల్లో గెలిచి 14 పాయింట్ల‌తో నాలుగో స్థానంలో ఉంది. బెంగ‌ళూరు ఆరు విజ‌యాల‌తో 12 పాయింట్ల‌తో ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో చెన్నై విజ‌యం సాధిస్తే.. ఎటువంటి అనుమానం లేకుండా నాకౌట్‌కు చేరుతుంది. ఒక‌వేళ ఓడినా చెన్నైకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఆ ఓట‌మి 18 ప‌రుగుల లోపే ఉండాలి. ఒక వేళ ఆర్ ఎస్‌బి గెలిచి ఇరుజ‌ట్ల పాయింట్లు స‌మమైతే.. మెరుగైన ర‌న్‌రేట్ కార‌ణంగా చెన్నైకే అవ‌కాశం ద‌క్కుతుంది.

1 Comment
  1. […] చివ‌రి ప్లేఆప్స్ బెర్త్ ఎవ‌రిదో..! […]

Leave A Reply

Your email address will not be published.