శ్రీకాకుళం జిల్లాలోని రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్
శ్రీకాకుళం (CLiC2NEWS): జిల్లాలో పైడిభీమవరంలోని రసాయన కార్మాగారంలో పేలుడు సంభవించి భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి.
హైదరాబాద్లోని శుక్రవారం షాద్నగర్ లో ఉన్న గ్లాసు పరిశ్రమలో కంపెషనర్ పేలి ఆరుగురు మృతి ఘటన మరువకముందే ఎపిలోని రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు సంభవించింది. పరిశ్రమలో కార్మికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పరిశ్రమ పరిసరాలలో ఉన్న వాహనాలు దగ్ధమయ్యాయి. సరకా ల్యాబరేటరీస్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునొ మంటలు అదుపు చేశారు.