మీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమే.. చైనా అధ్యక్షడు జిన్‌పింగ్
బీజింగ్ (CLiC2NEWS): భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్మకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను చక్కదిద్దుకోవడంతోపాటు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సరైన మార్గంలో ముందుకు తీసుకువెళ్లడానికి భారత నూతన రాష్ట్రపతితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. గతేడాది ఏప్రిల్ తర్వాత చైనా అధ్యక్షుడు భారత్‌పై స్పందించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.