రియల్ పేజ్ ఇండియా సంస్థ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్
హైదరాబాద్ (CLiC2NEWS) : బాలల దినోత్సవం సందర్భంగా రియల్ పేజ్ ఇండియా సంస్థ పాఠశాల విద్యార్థులకు 30వేల జతల షూస్‌ను విరాళంగా అందించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఈసంస్థ తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. పేద విద్యార్థుల కోసం మరిన్ని కార్యాక్రమాలు చేపడతామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటి ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి హాజరయ్యారు.