పుణ్య‌క్షేత్ర ద‌ర్శ‌నానికి వెళ్తుండ‌గా రోడ్డు ప్ర‌మాదం..

 రాజ‌మండ్రి(CLiC2NEWS): అన్నవ‌రం పుణ్య‌క్షేత్రానికి వెళ్తుండ‌గా తూర్పుగోదావ‌రి జిల్లాలోని జ‌గ్గంపేట వ‌ద్ద కారు పంట‌పొలాల్లోకి దూసుకెళ్ళి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఒకరు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. విజ‌య‌వాడ ప‌రిధిలోని సూర్యాపేట సిసిఎస్‌లో ఎస్ఐగా ప‌నిచేస్తున్న స‌త్య‌నారాయ‌ణ‌ కుటుంబ స‌మేతంగా అన్న‌వ‌రం బ‌య‌ల్దేరారు. అడ్డుగా వ‌చ్చిన కుక్క‌ను త‌ప్పించే ప్ర‌య‌త్నంలో కారు అదుపు త‌ప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయి బోల్తా ప‌డిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఎస్ఐ భార్య అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. ఆయ‌న‌తో పాటు గాయ‌ప‌డిన మిగిలిన‌ కుటుంబ‌స‌భ్యుల‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

toto slot

Leave A Reply

Your email address will not be published.