TS: ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం
హైదరాబాద్ (CLiC2NEWS): టీఎస్ ఆర్టీసీకి సోమవారం రోజున రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. సోమవారం ఒక్కరోజే ఆర్టీసీ బస్సులు 36.30 లక్షల కిలోమీటర్లు తిరిగాయని పేర్కొన్నారు. దీంతో ఆర్టీసీకి ఏకంగా రూ.14.79 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు.
దసరా, బతుకమ్మ పండుగలను జరుపుకోవడం కోసం చాలామంది గ్రామాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పండుగలు ముగించుకొని వారంతా తిరిగి వచ్చే క్రమంలో ఆర్టీసీపైనే ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తోంది. ప్రయాణికులంతా ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణించడంతో టీఎస్ఆర్టీసీకి భారీగా లాభాలు వచ్చినట్లు సమాచారం.
#TSRTC Management Extends Thanks to all citizens of #TelanganaState & neighboring States for utilizing our services during the #Dussehra festival, Yesterday we earned record revenue of 14.79 Cr with 36.30 lakh kms in a single day. Request to Continue your patronage towards #TSRTC pic.twitter.com/IwHqOt6vzh
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) October 19, 2021