నాబార్డ్‌లో 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీ

ముంబయి (CLiC2NEWS): నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ నాబార్డ్ లో మొత్తం 150 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. అభ్యర్థుల వయసు 21 నుండి 30 ఏళ్ల లోపు ఉండాలి. సెప్టెంబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి 60% మార్కులతో సంబంధిత విభాగంలో బిఇ, బిటెక్, బిఎస్‌సి, బిబిఎ, బిఎంఎస్, పిజిడిప్లమో, ఎంబిఎ, ఐసిఎఐ, సిఎఫ్ె, ఎసిఎంఎ, ఐసిడబ్ల్యుఎ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 44,500 నుండి 89,150 వరకు పేస్కేల్ ఉంటుంది. పూర్తి సమాచారం కొరకు https://www.nabard.org/contact.aspx?id=6&cid=18 ఈ వెబ్‌సైట్ చూడగలరు.