GoodNews: త‌గ్గిన ప‌సిడి ధరలు

హైద‌రాబాద్‌ (CLiC2NEWS):  మ‌న దేశంలో పెళ్లిళ్ల సీజ‌న్‌లో బంగారానికి ప్ర‌త్యేక డిమాండ్ ఉంటుంది. ఈ మ‌ధ్య కాలంలో ప‌సిడి ధరలు కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చాయి.

మార్కెట్ ప‌రంగా చూస్తే.. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. అటు అంత‌ర్జాతీయంగా కూడా బంగారం ధ‌ర‌లు కొంత‌మేర తగ్గడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్ల‌పై ప‌డింది.

తాజాగా ఈరోజు భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.100 తగ్గి రూ.44,000కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.110 తగ్గి రూ.48,000కి చేరిది. బంగారం ధ‌ర‌లతో పాటు వెండి ధ‌ర‌లు కూడా తగ్గాయి. కిలో వెండి ధ‌ర రూ.300 తగ్గి రూ. 73,100 వ‌ద్ద కొనసాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.