Good News: భారీగా తగ్గిన బంగారం ధరలు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): మ‌న దేశంలో పెళ్లిళ్ల సీజ‌న్‌లో బంగారానికి ప్ర‌త్యేక డిమాండ్ ఉంటుంది. ఈ మ‌ధ్య కాలంలో ప‌సిడి ధరలు కొన్ని రోజులుగా పెరుగుతూ, కొద్దిగా తగ్గుతూ వ‌చ్చాయి. మార్కెట్ ప‌రంగా చూస్తే.. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. అటు అంత‌ర్జాతీయంగా కూడా బంగారం ధ‌ర‌లు కొంత‌మేర తగ్గడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్ల‌పై ప‌డింది. ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒక రోజు ధరలు తగ్గుముఖం పడుతుంటే.. మరో రోజు పెరుగుతోంది. ఇక తాజాగా పసిడి ధర భారీగానే దిగి వచ్చింది. చాలా మంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటు బంగారంపై పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ఫలితంగా పసిడి ధర దిగివస్తోంది.

తాజాగా ఆదివారం బంగారం ధరలు భారీగా దిగిరావడం కొంత ఊరట కలిగించే అంశమనే చెప్పాలి. దేశీయంగా పరిశీస్తే.. 10 గ్రాముల ధరపై రూ.1000 వరకు తగ్గుముఖం పట్టింది. కొన్ని కొన్ని నగరాల్లో 600 నుంచి రూ.1000 వరకు తగ్గింది.

ప్రధాన నగరాల్లో ధరలు:

  • హైదరాబాద్‌లో
    22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,850
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840 ఉంది.

     

  • విజయవాడలో
    22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,850
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840 ఉంది.

     

  • ఢిల్లీలో
    22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,000
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,180 ఉంది.

     

  • చెన్నైలో
    22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,400
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది.

     

  • ముంబ‌యిలో
    22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,700
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,700 ఉంది.

     

  • కోల్‌కతాలో
    22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,350
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,050 ఉంది.

     

  • బెంగళూరులో
    22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,850
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840 ఉంది.

     

  • కేరళలో
    22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,850
    24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,840 ఉంది.
Leave A Reply

Your email address will not be published.