అక్రమ నల్లా కనెక్షన్ పొందిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలో మంచినీటి పైపులైను నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్న వ్యక్తిపై విజిలెన్స్ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ -4, ఆళ్లబండ సెక్షన్ పరిధిలోని పురానాపూల్ లోని రహీంపురకు చెందిన నాగరి కృష్ణ ఇంటి నం.13-2-784 కు అధికారుల అనుమతి లేకుండా రెండు అక్రమ నల్లా కనెక్షన్ తీసుకున్నాడు. జలమండలి విజిలెన్స్ అధికారుల తనిఖీలో బయటపడ్డ ఈ విషయం పై సంబంధిత యజమాని పై మంగల్ హాట్ పోలీసు స్టేషన్లో యు/ఎస్ 269, ఐపీసీ 430, 379 సెక్షన్ల కింద, పీడీపీపీ చట్టం ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశారు.
ఎవరైనా అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకుని కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించినట్లయితే 9989998100, 9989992268 నంబర్లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగలరని జలమండలి అధికారులు ప్రకటనలో తెలిపారు.