TS: సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో నేడు రిజిస్ట్రేషన్లు బంద్‌

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ (శుక్ర‌వారం) సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర డాటా సెంటర్‌లో కొత్త యుపిఎస్ ఏర్పాటు కారణంగా రిజిస్ట్రేషన్‌ సేవలకు అంతరాయం కలుగనుంది. ఈ కార‌ణంగా రిజిస్ట్రేషన్లు తిరిగి సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ చేపట్టే రిజిస్ట్రేషన్ల ‘కార్డు’ పోర్టల్ హైద‌రాబాద్‌ గచ్చిబౌలిలోని తెలంగాణ స్టేట్‌ డేటా సెంటర్‌ (టీఎస్‌డీసీ)కు అనుసంధానమై ఉంది. దీనిని 2011లో ఏర్పాటు చేశారు. ఇది ప్రభుత్వ శాఖల్లోని ప‌లు అప్లికేషన్లకు ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్నది.

ఎస్‌డీసీలో మెరుగైన పవర్‌ బ్యాకప్‌ కోసం శుక్రవారం నుంచి కొత్త యూపీఎస్‌ ఏర్పాటు పనులు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌డీసీ స్తంభించిపోతుండటంతో రిజిస్ట్రేషన్ల కార్డు పోర్టల్‌ కూడా పని చేయదు. దీంతో ఇవాళ రాష్ట్రంలోని 141 సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం లేదు. మళ్లీ సోమవారం నుంచి యధావిధిగా జరగనున్నాయి.

Leave A Reply

Your email address will not be published.