జెఇఇ-అడ్వాన్స్డ్ 2023 పరీక్షకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం..
![](https://clic2news.com/wp-content/uploads/2021/07/students.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): దేశవ్యాప్తంగా ఐఐటీల్లో బిటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జెఇఇ అడ్వాన్స్డ్ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్జిఎ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఏప్రిల్ 30వ తేదీ నుండి మే ఏడో తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు jeeadv.ac.in వెబ్ సైట్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. మే 29 నుండి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 4వ తేదీన పరీక్షను నిర్వహిస్తారు.
జెఇఇ మెయిన్ 2023 రెండో సెషన్ ఫలితాలు విడుదలయ్యాయి. దీనిలో టాప్ 2.5 లక్షల ర్యాంకులు వచ్చిన విద్యార్థులు అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హులు. బాలికలు రూ. 2900 ఫీజు చెల్లించాలి.