తెలంగాణ‌లో 38 ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల‌ రెగ్యుల‌రైజ్‌.. పోస్టుల మంజూరు

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలోని 38 ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల‌ను రెగ్యుల‌రైజ్ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్ర‌జ‌ల‌కు వేగంగా న్యాయం జ‌ర‌గాల‌న్న ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్రభుత్వం ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి త‌గు చ‌ర్యలు తీసుకోవాల‌ని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ జ‌న‌ర‌ల్‌ని కోరింది. రెగ్యుల‌రైజ్ చేసిన కోర్టుల్లో 22 అద‌న‌పు జిల్లా సెష‌న్స్ జ‌డ్జి క్యాడ‌ర్‌కు, మ‌రో 16 సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి క్యాడ‌ర్‌కు చెందిన‌వి.

ఆయా కోర్టుల కార్యాల‌యాల ఏర్పాటుకు సంబంధించి 1,098 పోస్టుల‌ను మంజూరు చేస్తూ ప్ర‌భుత్వం మ‌రో జిఓను విడుద‌ల చేసింది. 22 అద‌న‌పు జిల్లా సెష‌న్స్ జ‌డ్జి క్యాడ‌ర్ కోర్టుల‌కు సంబంధించి 682 పోస్టులు, 16 సీనియ‌ర్ సివిల్ జ‌డ్జి కోర్టుల‌కు 416 పోస్టులు మంజూరు చేసింది. దీంతో పాటు మ‌రో 14 అద‌న‌పు జిల్లా సెష‌న్స్ జ‌డ్జి కోర్టుల్లో 308 పోస్టులు మంజూరు చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Leave A Reply

Your email address will not be published.