వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ: ఎపి సర్కార్

విజయవాడ (CLiC2NEWS): కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త తెలిపింది. వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ శాఖలో మొత్తం 2146 మందిని క్రమబద్దీకరిస్తూ వైద్య శాఖ సిఎస్ కృష్ణబాబు జిఓ విడుదల చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.