టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
తిరుమల (CLiC2NEWS): తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లో అర్హులైన ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. టిటిడి ఛైర్మన్ భూమన కరుణాకరెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి మంగళవారం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించినట్లు సమాచారం. పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. టిటిడిలో అర్హులైన ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాలని నిర్ణయించారు. అలిపిరి గోశాల వద్ద నవంబర్ 23 నుండి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహణ, హోమానికి రుసుం రూ. వెయ్యిగా నిర్ణయించారు. ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం గురించి కూడా సమావేశంలో చర్చించారు. శాశ్వాత ఉద్యోగులకు రూ. 14 వేలు.. ఒప్పంద ఉద్యోగులకు రూ. 6,850 ఇవ్వాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది.