ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ

హైదరాబాద్ (CLiC2NEWS): 2023-24 తెలంగాణ బడ్జెట్‌లో రాష్ట్రంలోని కాంట్రాక్ట్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వం గలంలో ఇచ్చిన మాట మేరకు ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించనున్నట్లు ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అంగన్‌వాడీ, ఆశా,ఇంకా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఇవ్వడం, దానిని ఏకకాలంలో వర్తింపజేయటం దేశంలోనే ప్రథమం. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్ ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాలకు త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి హరీష్‌రావు ప్రకటించారు.
తప్పకచదవండి:telangana budget: తెలంగాణ మొత్తం బడ్జెట్ 2,90,396 కోట్లు
Telangana Budget: వ్యవసాయ రంగానికి కేటాయింపులు రూ. 26,831 కోట్లు
గూడులేని వారికి గుడ్‌న్యూస్.. సొంత జాగాలో ఇల్లు కట్టుకునేందుకు రూ. 3 లక్షలు!