AP: కూటమి మేనిఫెస్టో విడుదల
![](https://clic2news.com/wp-content/uploads/2024/04/BABU-menifesto.jpg)
విజయవాడ(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల జోరు పెరిగింది. తాజాగా మంగళవారం టిడిపి-జనసేన- బిజెపి కూటమి మేనిపెస్టోను విడుదల చేశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో మేనిఫెస్టోను విడుదల చేవారు. ఈ కార్యక్రమంలో టిడిపి అదినేత చంద్రబాబుతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, బిజెపి రాష్ట్ర ఇన్‌చార్జి సిద్ధర్థ్ నాథ్ సింగ్‌తో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు
- దీపం పథకం కింద ప్రతి ఇంటికి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితం
- మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం
- 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు ఊ. 1500 చొప్పున ఏడాదికి రూ. 18 వేలు అందజేత
- నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3 వేల చొప్పున నిరుద్యోగ భృతి
- ప్రతి ఇంటికి ఉచిత కుళాయి కనెక్షన్
- యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
- రైతన్నలకు ఏడాదికి రూ. 20 వేల చొప్పున పెట్టుబడి సాయం
- తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం
- ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటిస్థలం, ఇంటి నిర్మాణం
- ఇసుక ఉచితం
- భూ హక్కు చట్టం రద్దు
- సముద్ర వేట విరామ సమయంలో మత్త్య కారులకు రూ. 20 వేల సాయం
- చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు
- బిసిల రక్షణకు ప్రత్యేక చట్టం