తెలంగాణలో గ్రూప్-4 నోటిఫికేషన్ విడుదల
![](https://clic2news.com/wp-content/uploads/2021/02/tspsc.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతుంది. తాజాగా 9,168 పోస్టుల భర్తీకి సంబంధించిన గ్రూప్-4 నోటిఫికేషన్‌ను టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది. డిసెంబర్ 23వ తేదీ నుండి జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందని సమాచారం.
సిఎం కెసిఆర్ బడ్జెట్ సమావేశంలో చెప్పినట్లుగా గ్రూప్-4 వవిభాగంలో 9,168 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో ప్రభుత్వం మరో 4 రకాల పోస్టలను చేర్చింది.
పోస్టుల వివరాలు:
పట్టణాభివృద్ధి, పురపాలిక విభాగంలో– 2,701 పోస్టులు,
రెవెన్యూ శాఖలో — 2,077 పోస్టులు
పంచాయతీ రాజ్ శాఖలో — 1,245 పోస్టులు
ఉన్నత విద్యాశాఖలో — 742 పోస్టులు.