శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

తిరుమల (CLiC2NEWS): కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి ఆర్జిత సేవా టికెట్లు విడుదల అయ్యాయి. డిసెంబరు నెలకు సంబంధించిన ఆర్జిత దర్శనాల ఆన్లైన్ కోటాను విడుదల చేశారు. ఈ నెల 20 వ తేదీ ఉదయం 10 గంటలకు వరకు నమోదుకు ఆవకాశం కల్పించారు.
సెప్టెంబరు 21 వ తేదీ ఉదయం 10 గం. కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవా టికెట్లను అదే రోజు మధ్యాహ్నం గం. 3 కి విడుదల చేస్తారు.
23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, ఉదయం 11 గంటలకు శ్రీవారి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటా విడుదల చేస్తారు.
24న తేదీ ఉదయం 10 గంటలకు డిసెంబరు నెల ప్రత్యేక దర్శనం రూ.300 టెకెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ కోటాను విడుదల చేయనున్నారు.
27వ తేదీన ఉదయం గం 11కి డిసెంబరు కు సంబంధించి తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవా, మధ్యాహ్నం 1 గంటలకు పరకామణి సేవా కోటా విడుదల చేస్తారు. భక్తులు టిటిడి దేవస్థానం వెబ్సైట్లో సేవా టికెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి కోరింది.