తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌ల‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. జెఎన్‌టియు హెచ్ ప్రాంగ‌ణంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఈ ఫ‌లితాల‌ను శుక్ర‌వారం విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల్లో ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించ‌గా.. అగ్రిక‌ల్చ‌ర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో హైద‌రాబాద్‌కు చెందిన లోహిత్‌రెడ్డి మొద‌టి ర్యాంకు సాధించాడు.. ఎపిలోని శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన న‌క్కా సాయి దీప్తిక రెండో ర్యాంకు సాధించగా.. పొలిశెట్టి కార్తికేయ‌, ప‌ల్లి జ‌య‌ల‌క్ష్మి, ఎం. హిమ వంశి త‌ర్యాతి ర్యాంకుల్లో నిలిచారు.

అగ్రికల్చ‌ర్‌లో జుతూరి నేహ మొద‌టి ర్యాంకు సాధించ‌గా.. వి. రోహిత్ రెండో ర్యాంకు సాధించాడు.
గ‌త నెలం 18 నుంచి 21 వ‌ర‌కు ఇంజినీరింగ్‌, 30,31న అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మా ఎంసెట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. కాగా ఇంజినీరింగ్‌కు 1,56,812 మంది, అగ్రిక‌ల్చ‌ర్‌, ఫార్మా కోర్సుల కోసం 80,575 మంది ప‌రీక్ష‌లు రాశారు.

Leave A Reply

Your email address will not be published.