శిథిలాల నుండి బంగారు భ‌విత‌కు నాంది: సిఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి (CLiC2NEWS): స‌చివాల‌యం మీడియా స‌మావేశంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేశారు. రాజ‌ధాని ఏ ఒక్క‌రిది కాద‌ని.. యావ‌త్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌దన్నారు. ప్ర‌తి తెలుగు బిడ్డ అమ‌రావ‌తి నాది అని గ‌ర్వాంగా చెప్పుకోవాన‌ల‌న్నారు. అమ‌రావ‌తి పేరును క్యాబినేట్లో వంద‌శాతం అంగీక‌రించార‌ని తెలిపారు. ప్ర‌తి గ్రామం నుండి మ‌ట్టి , నీరు తెచ్చామ‌ని, య‌మునా న‌ది నీరు, పార్ల‌మెంట్ మ‌ట్టిని ప్ర‌ధాని మోడీ తెచ్చార‌ని తెలిపారు. దేశంలోని ప్ర‌ముఖ దేవాల‌యాల ప‌విత్ర జ‌లం, మ‌ట్టి మ‌హిమ అమ‌రావ‌తి ఉన్నాయ‌న్నారు. అందుకే అమ‌రావ‌తిని ఎవ‌రూ క‌దించ‌లేద‌న్నారు.

రాష్ట్రానికి రాజ‌ధాని న‌డి మ‌ధ్య‌నే ఉండాల‌ని ప్ర‌తిప‌క్ష‌నేత‌గా జ‌గ‌న్ ఆరోజు అన్నార‌ని.. కానీ , అధికారంలోకి వ‌చ్చాక జ‌గ‌న్ ఏంచేశారో ప్ర‌జ‌లే చూశార‌న్నారు. దేశంలో ఏ న‌గ‌రానికి లేని సౌల‌భ్య‌త అమ‌రావ‌తికి ఉంద‌ని.. ఒక వైపు గోదావరి, మ‌రో వైపు కృష్ణా రెండు న‌దుల అనుసంధానంతో.. ఇన్ని కిలోమీట‌ర్ల రివ‌ర్ ఫ్రంట్ మ‌రెక్క‌డా లేద‌ని తెలిపారు.

అమ‌రావ‌తి రైతుల త్యాగం చ‌రిత్ర గుర్తు పెట్టుంకుంటుంద‌న్నారు. 29 వేల మంది రైతులు 34,400 ఎకారాలు రాజ‌ధాని కోసం ఇచ్చారు. ప్ర‌భుత్వ భూమితో క‌లిపి 53,7454 ఎక‌రాలు రాజ‌ధాని కోసం స‌మ‌కూరింద‌ని తెలిపారు. అమ‌రావ‌తిలో పెట్టుబ‌డులు పెట్టేందుకు అనేక‌మంది ముందుకొచ్చారు. కానీ ఈ ఐదు సంవ‌త్స‌రాల‌లో విధ్యంసం జ‌రిగిందన్నారు. ఒక‌సారి న‌మ్మ‌కం కోల్పేతే పెట్టుబ‌డులు మ‌ళ్లీ వ‌స్తాయా?  ఇపుడు పెట్టుబ‌డుదారుల‌ను ర‌ప్పించాలంటే చాలా క‌ష్టప‌డాలి. మ‌ళ్లీ ఇబ్బందులు రావ‌ని భ‌రోసా ఏంట‌ని అడుగుతున్నార‌న్నారు.

మ‌న ప్ర‌జ‌ల‌కు తెలివితేట‌లు లేవా.. మ‌న రాష్ట్రం రైస్ బౌల్ అని దేశవ్యాప్తంగా తెలిసిన విష‌య‌మే. అమ‌రావ‌తికి బ్రాండ్ ఇమేజ్ ఎలా తేవాల‌నే ఆలోచిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ శిథిలాల నుండే బంగారు భ‌విష్య‌త్తుకు నాంది ప‌లుకుతామ‌న్నారు. అమ‌రావ‌తిలో ప‌నులు మ‌ళ్లీ ప్రారంభ‌మ‌య్యాయ‌ని, అంచెలంచెలుగా పూర్తి చేస్తామ‌ని సిఎం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.