రిలయన్స్ – డిస్నీ మీడియా విలీనం
ముంబయి (CLiC2NEWS): రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్డ్ డిస్నీకి చెందిన మీడియా వ్యాపారాల విలీనం పూర్తయినట్లు సమాచారం. కొన్ని నెలల క్రితమే ఈ విలీనానికి సిసిఐ, ఎన్‌సిఎల్‌టి వంటి నియంత్రణ సంస్థల నుండి అనుమతి లభించింది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ , అనుబంధ సంస్థలకు 63.16% వాటా ఉంది. అంర్జాతీయ మీడియా దిగ్గజం వాల్ట్ డిస్నీ కి 36.84% వాటా ఉంది. ఈ రెండు సంస్థల విలీనంతో తాజాగా 100కు పైగా టివి ఛానళ్లు ఒకే గొడుగు కిందకు రానున్నాయి. స్టార్, కలర్స్ పేరిట ఉన్న ఛానెళ్లు ఒకపై ఒకటి కానున్నాయి. జియో సినిమా, డిస్నీ+హాట్‌స్టార్ పేరిట ఉన్న ఒటిటి ప్లాట్‌ఫారంలను విలీనం చేసి జియే స్టార్‌గా వ్యవహిరించనున్నట్లు సమాచారం. ఈ సంస్థ రూ.70,353 కోట్ల విలువతో దేశంలోనే అతిపెద్ద మీడియా సంస్థగా ఏర్పడింది. దీని వృద్ధికి గాను రూ. 11,500 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు రిలయన్స్ ప్రకటించింది. ఈ సంస్థకు ముకేశ్ నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ఉదయ్‌శంకర్ వైస్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం.