పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహాకారాలు అందిస్తాం: సిఎం రేవంత్ రెడ్డి
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/CM-REVANTH-REDDY-IN-SECRETARIAT.jpg)
హైదరాబాద్ (CLiC2NEW): పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహాకారాలు అందిస్తామని, పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయంలో మంగళవారం ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో సిఎం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు సులభంగా అందిస్తామని, మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేస్తామని, కొంగర కాలాన్ ఉత్పాదక కేంద్రానికి, పాక్స్‌కాన్ భవిష్యత్ ప్రాజెక్టుకు సహకారం అందిస్తామని తెలిపారు.