గణతంత్ర దినోత్సవపు వేడుకల్లో ఎపి ఏటికొప్పాక బొమ్మల శకటం

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకతను చాటి చెప్పే ఏటి కొప్పాక బొమ్మల శకటం గణతంత్ర వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా పలు రాష్ట్రాల శకటాల ప్రదర్శన ఆకట్టుకున్నాయి. ఎపి నుండి ఏటికొప్పకా బొమ్మల శకటం ప్రదర్శించబడింది. మామూలు కర్రతో తయారు చేసే ఈ బొమ్మలు.. ఎటు చూసినా నునుపుగా ఉండే ఈ కళాకండాలు చిన్నారుల ఆటవస్తువులుగా ఉండేవి. ఇపుడు దేశ గణతంత్రవేడుకలలో శకటం రూపంలో దర్శమిచ్చాయి.
గణతంత్ర వేడుకలలో మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు ప్రదర్శించారు. రాష్ట్రపతి భవన్ నుండి ఎర్రకోట వరకు 9 కిలోమీటర్ల మేర రిపబ్లిక్ డే పరేడ్ ఏర్పాటు చేశారు. 76వ గణతంత్ర వేడుకలకు ఇండోనోషియా అధ్యక్షుడు ప్రబొవొ సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు.