రాజీనామా చేస్తున్నా: యడ్యూరప్ప

బెంగళూరు (CLiC2NEWS): సిఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రకటించారు. ఈ మధ్య కాలంలో కన్నడనాట నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో యడ్యూరప్ప రాజీనామా చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం తర్వాత గవర్నర్‌ను కలిసి రాజీనామా సమర్పించే అవకాశముంది. సిఎంగా యడ్యూరప్ప రెండేళ్లపాటు విజయవంతంగా ప్రభుత్వాన్ని నడిపారు. కర్ణాటకలో యడ్యూరప్ప సర్కార్ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చేస్తున్నానని చెప్పే సమయంలో ఆయన కాస్త భావోద్వేగానికి గురయ్యారు. యడ్యూరప్పను పదవి నుంచి తప్పిస్తున్నారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. యడ్యూరప్ప రాజీనామా వార్తతో తదుపరి సిఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది.