హైద‌రాబాద్‌లో న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు..

హైద‌రాబాద్ (CLiC2NEWS): న్యూఇయ‌ర్ వేడుక‌ల‌లో పాల్గొనాల‌నుకునేవారు త‌ప్ప‌నిసరిగా నిబంధ‌న‌లు పాటించాలి. ఈమేర‌కు హైద‌రాబాద్ సివి ఆనంద్ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్టిలో ఉంచుకొని న్యూఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించారు. తెలంగాణ ప్ర‌భుత్వం డిసెంబ‌ర్ 31 అర్థ‌రాత్రి 12గంట‌ల వ‌ర‌కు మ‌ద్యం దుకాణాలు, ఒంటి గంట వ‌ర‌కు బార్లు, ప‌బ్బులు తెరిచి ఉండేందుకు అనుమ‌తినిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఒమిక్రాన్ వ్యాప్తి కార‌ణంగా వేడుక‌ల విష‌యంలో ఆంక్ష‌లు విధించాల‌న్న కోర్టు ఉత్త‌ర్వుల‌ను ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని న్యాయ‌వాది సిజె ధ‌ర్మాస‌నం దృష్టికి తెచ్చారు. దీంతో సివి ఆనంద్ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు.

వేడుక‌ల‌లో మాస్క్ ధ‌రించ‌క‌పోతే రూ. 1000 జ‌రిమానా. రెండు డోసులు టీకాలు తీసుకున్న వారికి మాత్ర‌మే వేడుక‌ల‌లో అనుమ‌తి. బ‌హిరంగ ప్ర‌దేశాల‌లో డిజెల‌కు అనుమ‌తి లేదు. ప‌బ్‌లు, రెస్టారెంట్‌లలో భౌతిక‌దూరం త‌ప్ప‌కుండా పాటించాలి. మ‌ద్యం సేవించి వాహ‌నం న‌డిపితే 6 నెల‌ల జైలు శిక్ష‌, రూ. 10వేలు జరిమానా, అస‌భ్య‌క‌ర దుస్తులు ధ‌రించి నృత్యాలు చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని స్ప‌ష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.