AP: పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థ‌ల్లో బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బంది ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు 62 సంవ‌త్స‌రాల‌కు పెంచాల‌ని విద్యాహ‌క్కు చ‌ట్టం స‌వ‌ర‌ణ బిల్లును శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్య‌నారాయ‌ణ విద్యాహ‌క్కు చ‌ట్టం 1982 స‌వ‌ర‌ణ బిల్లు, పబ్లిక్ గ్రంథాల‌యాల చ‌ట్టం 1962 స‌వ‌ర‌ణ బిల్ల‌ను కూడా ఆదివారం శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. జిల్లా గ్రంథాల‌య సంస్థ‌ల ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌‌య‌సును 62 ఏళ్ల‌కు పెంచేందుకు ప‌బ్లిక్ గ్రంథాల‌య చ‌ట్టం 1962 స‌వ‌ర‌ణ బిల్లును శాస‌న‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. దీంతో 2022 జ‌న‌వ‌రి 1వ తేదీ నుంబి 2022 న‌వంబ‌ర్ 29వ తేదీ మ‌ధ్య అర‌వై సంవ‌త్స‌రాలు నిండి.. ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన గ్రంథాల‌య సంస్థ‌ల‌ వారిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించింది.

Leave A Reply

Your email address will not be published.