కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ బహిరంగ క్షమాపణ
క్షమాపణపై కోమటిరెడ్డి రియాక్షన్ ఏంటంటే..
హైదరాబాద్ (CLiC2NEWS): భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ రేవంత్ క్షమాపణలు చెబుతూ ట్టిట్టర్‌లో పోస్టు చేశారు. హోంగార్డు ప్రస్తావన, చండూరు సభలో వ్యాఖ్యలపై కోమటిరెడ్డికి క్షమాపణలు చెబుతున్నట్లు పిసిసి చీఫ్ తన వీడియోలో పేర్కొన్నారు. ఇలాంటి భాష వాడటం ఎవరికీ మంచిది కాదని రేవంత్ అభిప్రాయపడ్డారు.
చండూరు సభలో కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు రేవంత్ క్షమాపణ చెప్పారు.
దీనిపై కోమటిరెడ్డి స్పందించారు. రేవంత్ క్షమాపణలను తాను పట్టించుకోనని కోమటిరెడ్డి అన్నారు. తనపై పరుష పదజాలం వాడిన అద్దండి దయాకర్ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. సస్పెన్షన్ తర్వాతే రేవంత్ క్షమాపణపై స్పందిస్తానని కోమటిరెడ్డి అన్నారు.