కాంగ్రెస్ గెలిస్తే ఆదిలాబాద్ జిల్లాను ద‌త్త‌త తీసుకుంటా..రేవంత్‌

బోథ్‌ (CLiC2NEWS): కాంగ్రెస్ వ‌స్తే.. ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తామ‌ని టిపిసిసి అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లో నిర్వ‌హించిన కాంగ్రెస్ విజ‌య‌భేరి స‌భ‌లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 24 గంట‌ల ఉచిత విద్యుత్ ఇస్తామ‌న్నారు. మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం ద్వారా ప్ర‌తి మ‌హిళ‌కు నెల‌కు రూ. 2,500 ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌పుడు గ్యాస్ సిలెండ‌ర్ ధ‌ర రూ. 400 ఉండేద‌ని.. మోడీ, కెసిఆర్ దానిని రూ. 1200 చేశార‌ని ఆరోపించారు. ఈ నియోజ‌క వ‌ర్గంలో ఒక‌సారి కాంగ్రెస్‌కు ఓటెయ్యండి.. కాంగ్రెస్ గెలిస్తే బోత్‌లో ప్ర‌భుత్వ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. అంతేకాకుండా ఆదిలాబాద్ జిల్లాను ద‌త్త‌త తీసుకుంటాన‌ని రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా గాంధీ ప్ర‌క‌టించిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేసి తీరుతామ‌ని ఈ సంద‌ర్బంగా రేవంత్ రెడ్డి మాటిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.