తెలంగాణ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేస్తాం: స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటి

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేసేందుకు స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటి ముందుకొచ్చింది. రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగితి తెలిసిందే. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటి, గూగుల్ ప్ర‌ధాన కార్యాల‌యం , జొయిటిస్ కంపెనీని సిఎం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కేంద్రం ఏర్పాటు చేయాల‌ని స్టాన్ ఫోర్డ్ బ‌యోడిజైన్ అధికారుల‌ను సిఎం ఆహ్వానించారు. విద్య‌, నైపుణ్యాభివృద్ధి, హెల్త్‌కేర్ రంగాల్లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంపై స్టాన్‌ఫోర్డ్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోడిజైన్ సీనియ‌ర్ ప్ర‌తినిధుల‌తో సిఎం చ‌ర్చించారు.

తెలంగాణ‌లో స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటి శాటిలైట్ సెంట‌ర్ ఏర్పాటును ప‌రిశీలించాల‌ని సిఎం కోరారు. తెలంగాణ రాష్ట్రం, స్టాన్‌ఫోర్డ్ భాగ‌స్వామ్యం వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా హెల్త్ కేర్ రంగానికి ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌న్నారు. గ్లోబ‌ల్ లీడ‌ర్ల భాగ‌స్వామ్యంతో హెల్త్ కేర్ రంగంలో అవ‌స‌ర‌మైన ఆధునిక నైపుణ్యం, ప‌రిజ్ఞానాన్ని రాష్ట్రంలోని యువ‌తకు అందించాల‌నే ఉద్దేశ్యంతో ఉన్న‌ట్లు సిఎం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.