రేపు నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం.. రాష్ట్ర ప్రజలకు ఆహ్వాన లేఖ

హైదారాబాద్ (CLiC2NEWS): తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నగరంలోని ఎల్‌బి స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ నేపథ్యంలో ఆయన రాష్ట్ర ప్రజలను ఆహ్వానిస్తూ.. ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభినందనలు. విద్యార్థుల, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు మీ అందరి ఆశీస్సులతో రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నా. ఈ కార్యక్రమానికి రావల్సిందిగా ప్రజలందరికీ ఇదే నా ఆహ్వానం.. అని రేవంత్ రెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు.