కోకాపేట వెళ్లకుండా రేవంత్‌రెడ్డి గృహనిర్బంధం

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): రంగారెడ్డి జిల్లా కోకాపేట‌లో ప్ర‌బుత్వం వేలం వేసిన భూముల సంద‌ర్భ‌న, ద‌ర్నాకు కాంగ్రెస్ పార్టీ పిలుపును ఇచ్చిన నేప‌థ్యంలో జూబ్లీహిల్స్‌లోని పిసిసిసి అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి నివాసం వ‌ద్ద భారీగా పోలీసులు మోహ‌రించారు.

కాగా కోకాపేట భూములను సందర్శించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ప్రభుత్వం వేలం వేసిన భూముల వద్ద ధర్నాకు పిలుపునిచ్చింది. ఇవాళ (సోమ‌వారం) ఉదయం 11 గంటలకు ఆ భూములను పరిశీలించడానికి దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి, మహేశ్​కుమార్ రెడ్డి తదితర నేతలు.. కోకాపేటకు వెళ్లనున్నారు.

ఈ నేపథ్యంలో పోలీసులు జూబ్లీహిల్స్​లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఇంటి వద్ద భారీగా మోహరించారు. రేవంత్​ను గృహనిర్బంధం చేశారు. ఆయన కోకాపేట వెళ్లకుండా ముందస్తుగానే అడ్డుకున్నారు. పార్లమెంటు సమావేశాలకు వెళ్లకుండా తనను అడ్డుకుంటున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని రేవంత్ ఈమ‌ధ్య ఆరోపణలు చేశారు. కేంద్ర హోంశాఖకు ఆధారాలతో ఫిర్యాదు చేస్తానని తెలిపారు. దీనిలో భాగంగానే ఆ భూముల సంద‌ర్భ‌న‌కు పిలుపునిచ్చింది.

పార్ల‌మెంట్‌లో కోకాపేట భూముల అవినీతిని ఎండ‌గ‌డ‌తార‌నే భ‌యంతోనే కాంగ్రెస్ నేత‌ల‌ను అడ్డుకున్నారని పిసిసి సీనియ‌ర్ ఉపాధ్య‌క్షుడు మ‌ల్లు ర‌వి ఆరోపించారు.

Leave A Reply

Your email address will not be published.