Right to Sit: చేయి కలుపలేరా..?

రంగురంగుల పట్టువస్త్రాల మధ్యలో లేత భానుడి

కిరణాల నుండి ఊపిరిని

ఉగ్గబట్టి కొకూన్లా చీకటి వేళనా ముడుచుకొనిపోయిన ఉండలా

శ్రమజీవుల ఆకలిపోరాటం…!!

ఎంతో మందికి విద్యను నేర్పి

భావితరాలకు టీచర్లు

డాక్టర్లు, ఇంజనీర్ లు, లాయర్లు

సైంటిస్ట్ లను తమ కాళ్ళ మీద తాము నిలబడేలా తయారుచేస్తున్న ఉపాధ్యాయులే తమ కాళ్ళు లాగినపుడు

క్లాస్ లో కూర్చునే

సదుపాయం లేని వింత ధోరణి…!!

అయిదు రోజుల అవస్థ కలిగినపుడు అయినా

నించుని చేసే పనివేళల

పరిహాసం నిద్దట్లో పీడకలలా వెంటాడుతుంటే…, !!

సెలవులు లేని చిరుద్యోగులు

నిలబడి నిలబడి కొందరు

నీళ్లు కూడా సమయానికి

తాగలేక ఇంకొదరు….!!


కిడ్ని రోగాలతో మరెన్నో

జబ్బులతో చిన్న

వయసులోనే దవాఖానాలో

పడి పెద్ద కష్టాల పాలు

అన్నింటికి రికాం లేని పనియాతనలే….!!

శ్రమ దొపిడి నిలువునా

మనిషి జవసత్వాలను మ్రింగేసి

వృద్ధాప్యం ఆవరిస్తుంటే…..,

కొంచెం స్వేదాన్ని చల్లబరిచే

చిన్న విశ్రాంతి కోసం లక్షల మంది ఎదురుచూపులు….!!

ఎలా చెప్పాలి?

ఈ అవస్థను…!!

ఎవరికి చెప్పుకోను?

ఈ పరిస్థితిని….!!

ఎన్నాళ్ళని మౌనంగా

ఊపిరిని ఉగ్గబట్టి జబ్బుల

పాలు గావాలే….!!

మీ గొంతుని మాతో కలపలేరా ?

మీ వంతుగా మీ చేయిని కలుపలేరా ??

-పద్మజ బొలిశెట్టి

We all are condemn that situation.. It is right time to movement
# Right to Sit #Act

Leave A Reply

Your email address will not be published.