త్వ‌ర‌లో రాష్ట్రంలో రైజింగ్ విజ‌న్ బోర్డు ఏర్పాటు: సిఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో ఆర్ధిక శాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్ర‌హీత అభిజిత్ బెన‌ర్జీ భేటీ అయ్యారు. త్వర‌లో రాష్ట్రంలో రైజింగ్ విజ‌న్ బోర్డు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు సిఎం ఈ సంద‌ర్బంగా తెలిపారు. ఈ బోర్డు లో భాగ‌స్వామ్యం కావాల‌ని అభిజిత్ బెన‌ర్జీని కోర‌గా.. ఆయ‌న అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ప్యూచ‌ర్ సిటిలో ఆర్ట్స్ అండ్ క్రాప్ట్స్ , సృజ‌నాత్మ‌క‌తను భాగం చేయాల‌ని ఈ సంద‌ర్బంగా అభిజిత్ బెన‌ర్జి సూచించారు. సంప్ర‌దాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపార‌వేత్త‌లుగా మార్చేందుకు ప్ర‌త్యేక స్వ‌ల్ప‌కాలిక కోర్సులు నిర్వ‌హించాల‌ని సూచించిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.