మిస్ యూనివర్స్ ఇండియా 2024 కిరీటం దక్కించుకున్న రియాసింఘా

జైపుర్ (CLiC2NEWS): మిస్ యూనివర్స్ 2024 కిరీటాన్ని ఈ ఏడాది గుజరాత్‌కు చెందిన రియా సింఘా సొంతం చేసుకున్నారు. జైపుర్ వేదికగా జరిగిన మిస్ యూనివర్స్ ఇండియా 2024 పోటీల్లో రియా గెలుపొందారు. రియా సింఘా 18 ఏళ్ల వయస్సులోనే ఈ పోటీల్లో గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. 51మంది ఫైనలిస్టులతో పోటీ పడి ఆమె ఈ కిరీటం దక్కించుకున్నారు. 2015లో మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని దక్కించికున్న ఊర్వశి రౌతేలా ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్వవహరించారు.