దైవ దర్శనానికి వెళ్లి వస్తూ.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
శ్రీకాళహస్తి (CLiC2NEWS): దైవ దర్శనానికి కుటుంబంతో వెళ్లిన వారు ప్రమాదానికి గురై మృతి చెందారు. వీరు ప్రయాణిస్తున్న కారును మినీ వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రీ, కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాళహస్తికి చెందిన కుటుంబం కారులో దైవదర్శనానికి వెళ్లి.. తిరుగుప్రయాణ సమయంలో తిరువణ్ణామలైవద్ద ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. తీవ్రగాయాలైన ఇద్దరు మహిళలతో పాటు మిని వ్యాన్‌లో ఉన్న మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. వీరిలో డాక్టర్ మౌనిక చికిత్స పొందుతూ మరణించింది. ఈ ప్రమాదంలో మౌనిక, ఆమె భర్త సూర్యతేజ రెడ్డి, మామ దయాసాగర్ రెడ్డి మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాయఛాయలు అలుముకున్నాయి. మౌనిక, సూర్యతేజరెడ్డి ఇద్దరూ డాక్టర్లే.. వీరికి కిందటేడాది వివాహమైంది.