కామారెడ్డి జిల్లాలో కారును ఢీకొన్న బస్సు.. ఐదుగురు మృతి

కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి జిల్లా మాచరెడ్డి మండలం ఘన్‌పూర్(ఎం) గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. ఆర్టీసీ బస్సు టైరు పేలడంతో అదుపు తప్పి కారును ఢీకొట్టింది. దీంతో కారు పక్కన ఉన్క చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, బాలుడు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ చిన్నారికి గాయాలయ్యాయి.
కామారెడ్డి వైపు నుండి వస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. కారు నెంబర్ ఆధారంగా మృతులంతా నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లెకి చెందినవారుగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.