కోదాడ సమీపంలో బైకును ఢీకొట్టిన కారు.. చిన్నారి సహా ముగ్గురు మృతి

కోదాడ (CLiC2NEWS): సుర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని గుడిబండ ప్లైఓవర్ వద్ద గరువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ముగ్గురు పిల్లల సహా భార్యాభర్తలు ఒకే బైక్‌పై వెళ్తున్నారు. బైకు వెనుక వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న ఐదుగురు ప్లైఓవర్‌పై నుండి కిందకు పడిపోయారు. దీంతో చిన్నారి సహా దంపతులు మృతి చెందారు. మరో ఇద్దరు చిన్నారులు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి నియోజకవర్గ పర్యటనను ముగించుకొని, మేళ్లచెర్వు వైపు వెళుతున్నారు. ఆయన ఈ ప్రమాదాన్ని గమనించి, 108 అంబులెన్స్‌కి ఫోన్ చేసి గాయపడిన వారిని ఆప్పత్రికి తరలించడంలో సహాయపడ్డారు. జిల్లా కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎప్సి రాజేంద్రప్రసాద్‌తో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.