ఔరంగాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలంగాణ వాసులు మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2022/11/accident.jpg)
సిద్దిపేట (CLiC2NEWS): ఔరంగాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. మరణించిన వారు సిద్దిపేట జిల్లా చౌటపల్లికి చెందిన నలుగురు అన్నదమ్ములుగా గుర్తించారు. ఈ నలుగురు బంధువుల అంత్యక్రియలకని చౌటపల్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అన్నదమ్ములు కుటుంబసభ్యులతో కలిసి బంధువుల అంత్యక్రియలకు చౌటపల్లికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో అదుపుతప్పి పల్టీలు కొట్టింది. దీంతో నలుగురు అన్నదమ్ములు అక్కడికక్కడే మృతిచెందారు. వీరు బ్రతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లినట్లు సమాచారం. ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో ఆకుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.