విషాదంగా మారిన విహారయాత్ర.. ముగ్గురు వైద్యులు మృతి

విడపనకల్లు (CLiC2NEWS): వారు ప్రాణాలు కాపాడే వైద్యులు. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. అనంతపురం జిల్లాలోని విడపనకల్లు వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కారు నుజ్జునుజ్జయిపోయింది. తీవ్ర మంచు వలనే ప్రమాదం జరిగినట్లు పోలసులు భావిస్తున్నారు. మరణించిన వారు బళ్లారికి చెందిన ఒపిడి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులుగా గుర్తించారు. వీరంతా హాంకాంగ్ విహారయాత్రకు వెళ్లి వస్తున్న క్రమంలో వార ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.