బండ్ల‌గూడ‌లో కారు భీభ‌త్సం.. పోలీసుల అదుపులో విద్యార్థి

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): డిగ్రీ ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థి కారు న‌డిపి.. ఇద్ద‌రు మ‌హిళ‌ల మృతికి కార‌ణ‌మ‌య్యాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బిబిఎ మొద‌టి సంవ‌త్స‌రం చ‌దువుతున్న విద్యార్థి బ‌ద్రుద్దీన్ ఖాదిరి త‌న ముగ్గురు స్నేహితుల‌తో మొయినాబాద్ వైపు వెళుతున్నాడు. బండ్ల‌గూడ స‌న్ సిటీ వ‌ద్ద కారు అదుపు తప్పి వాకింగ్ చేస్తున్న ముగ్గురు మ‌హిళ‌ల‌ను ఢీకొట్టింది. అనంత‌రం మ‌రో వ్య‌క్తిని ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో త‌ల్లీ కూతురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర‌గాయాల‌య్యాయి. వారిని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్సనందిస్తున్నారు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు పుట్టిన‌రోజు వేడుక జ‌రుపుకునేందుకు స్నేహితుల‌తో క‌లిసి వెళ్లిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.