చంద్రగిరి మండలంలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

చంద్రగిరి (CLiC2NEWS): తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందినట్లు సమాచారం. మండలంలోని భాకరాపేట కనుమ రహదారిలో కలకడ నుంచి చెన్నైకి టమోటాలను తీసుకు వెళ్లున్న కంటైనర్ లారీ అదుపు తప్పి తీరుపతి నుంచి పీలేరు వైపు వెళ్లొన్న కారు, బైకుపై పడింది. ఈ ప్రమాదం కారణంగా ఆ దారిలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి ట్రాఫిక్‌ను క్రమద్ధీకరించారు. సహాయక చర్యలను పోలీసులు చేపట్టారు. కాగా కంటైనర్ కింద ఉన్న కారులో ఎంత మంది ప్రయాణిస్తున్న దానిపై ఇంకాస్పష్టత లేదు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.