వివాహానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి
రాయ్‌పుర్ (CLiC2NEWS): వివాహానికి వెళ్తున్న ఎస్యువి వాహనం ట్రాక్‌ని ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు, ఐదుగురు మహిళలు సహా 11 మంది మృత్యువాత పడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బాలోడ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారంతో వివాహానికి వెళ్తున్నారు. ఎదురుగా వస్తున్న ట్రక్‌ని ఢీకొట్టడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ పరారయ్యాడు. బాధితులంతా ధమ్తారీ జిల్లాలోని సోరమ్ -భట్గావ్ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ సిఎం భూపేశ్ బఘేల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.