చిక్‌బ‌ళ్లాపూర్‌లో రోడ్డు ప్ర‌మాదం.. 13 మంది ఎపి వాసుల మృతి

చిక్‌బ‌ళ్లాపూర్ (CLiC2NEWS): క‌ర్ణాట‌క‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. గురువారం ఉద‌యం చిక్‌బ‌ళ్లాపూర్ స‌మీపంలో లారీని కారు ఢీకొన్ని ఘ‌ట‌న‌లో 13 మంది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వారు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు గాయ‌ప‌డిన వారిని స్థానిక హాస్పిట్‌కు త‌లించారు. కాగా మృతుల్లో 9 మంది పురుషులు, ముగ్గురు మ‌హిళ‌లు, ఒక బాలుడు ఉన్నారు.


ఈ ఘ‌ట‌న‌పై చిక్‌బళ్లాపూర్ పోలీసు అధికారు న‌గేశ్ వివ‌రాలు వెళ్ల‌డించారు. ద‌స‌రా పండుగ‌కు వీరంతా సొంత ఊళ్ల‌కు వెళ్లి తిరిగి బెంగ‌ళూరులోని హోంగ‌సంద్ర వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలిపారు. చిక్‌బ‌ళ్లాపూర్ స‌మీపంలో ఆగి ఉన్న ట్యాంక‌ర్‌కు టాటా సుమో బ‌లంగా ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌మాద స‌మ‌యంలో వాహ‌నంలో 14 మంది ఉన్న‌ట్లు స‌మాచారం. ఘ‌ట‌నా స్థ‌లంలోనే ఐదుగురు మ‌ర‌ణ‌ఙంచాగా చిక్‌బ‌ళ్లాపూర్ ద‌వాఖానాలో చికిత్స ఉందుతూ 8 మంది మృతి చెందారు. ఈ ఘ‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.