సైనిక వాహనం అదుపుతప్పి ఇద్దరు సైనికులు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం
శ్రీనగర్ (CLiC2NEWS): సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపత్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌లో బందిపొరాలోని వులార్ వ్యూపాయింట్ వద్ద చోటుచేసుకుంది. పహారా కాసేందుకు వెళుతున్న వాహనం అదుపుతప్పి ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని బందిపొరా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుండి శ్రీనగర్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లవారం రోజుల క్రితం పూంఛ్ జిల్లాలోనూ ఇదే తరహా రోడ్డు ప్రమాదం జరిగింది. సైనికులు ప్రయాణిస్తున్న వాహనం 300 అడుగుల లోతైన లోయలో పడిపోయి.. ఐదుగురు మృత్యువాతపడ్డారు.