కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగు మృతి
కొత్తగూడెం (CLiC2NEWS): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బొలేరో వాహనాన్ని బొగ్గు టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని కొత్తగూడెంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జిల్లాలోని చంద్రగొండ మండలంకు చెందిన కూలీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని తిప్పనపల్లి వద్ద బొగ్గు టిప్పర్ బలంగా ఢీకొట్టడంతో ఈప్రమాదం జరిగింది. ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మహిళలు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.