మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలో ఆటోను ఢీకొన్న వాహ‌నం.. ఆరుగురు మృతి

మ‌హాబూబ్‌న‌గ‌ర్ (CLiC2NEWS): జిల్లాలోని బాల‌న‌గ‌ర్ చౌర‌స్తాలో ఆటోను డిసిఎం వాహ‌నం ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తండా వాసులు బాల‌న‌గ‌ర్‌లోని సంత నుండి ఆటోలో తిరిగి వెళ్లే క్ర‌మంలో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. మ‌ర‌ణించిన వారిలో ఇద్ద‌రు చిన్నారులు కూడా ఉన్నారు. మృతులు బాలాన‌గ‌ర్ మండ‌లంలోని మేడిగ‌డ్డ తండా, నందారం, బిబిన‌గ‌ర్ తండా వాసులుగా పోలీసులు గుర్తించారు.

Leave A Reply

Your email address will not be published.